మా రాష్ట్రాల్లో కరోనా లేదోచ్.. సంతోషంలో సీఎంలు

మా రాష్ట్రాల్లో కరోనా లేదోచ్.. సంతోషంలో సీఎంలు

కరోనాను కట్టడి చేయాలని రాష్ట్రాలు సొంతంగా ప్రణాళికలు రచించుకుంటున్నాయి. ఇందులో భాగంగానే కొన్ని రాష్ట్రాలు లాక్డౌన్‌ని పొడిగిస్తే, మరికొన్ని రెడ్ జోన్ ఏరియాల్లో కట్టుదిట్టమైన నిబంధనలు విధించాయి. కొన్ని ప్రాంతాలు సడలిస్తున్నాయి. వీలైనంత త్వరగా తమ రాష్ట్ర ప్రజలను కరోనా నుంచి విముక్తి చేయాలని కంకణం కట్టుకుని పని చేస్తున్నాయి. కేంద్ర సహకారాన్ని కోరుతూ సొంతంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మణిపూర్ రాష్ట్రంలో కోవిడ్ సోకిన ఇద్దరు వ్యక్తులు పూర్తిగా కోలుకున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం బిరేందర్ సింగ్ ప్రకటించారు. ఆపై ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదంటూ ఆయన ట్వీట్ చేశారు. వైద్య సిబ్బంది తో పాటు ప్రజల సహకారం తోడవడం వలనే ఇది సాధ్యమైందని ఆయన అన్నారు. లాక్డౌన్ నిబంధనలను కఠినతరం చేయడం కూడా ఒక కారణంగా చెప్పారు.

ఇక మా రాష్ట్రం నుంచి కూడా కరోనా పారిపోయిందంటూ మరో రాష్ట్రం గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆదివారం ప్రకటించారు. ఏప్రిల్ 3 నాటికే ఏ కొత్త కరోనా కేసు నమోదు కాలేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో కోవిడ్ లేదని చెప్పడం తనకెంతో సంతోషాన్ని ఇస్తుందన అన్నారు. విదేశాల నుంచి వచ్చిన ఆరుగురు పౌరులను గుర్తించి వారిని గృహనిర్భంధంలో ఉంచామన్నారు. కరోనా కట్టడికి సహకరించిన రోగులకు, వైద్య సిబ్బందికి, ఇతర సిబ్బందికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. కరోనా ఫ్రీ అయినా సామాజిక దూరం పాటించాలని సీఎం ప్రజలను కోరారు. మే 3 వరకు లాక్డౌన్ కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు. జీరో కేస్ విజయం ప్రజలందరిదీ అని ఆయన అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story