జర్నలిస్టులకు కరోనా పాజిటివ్..

జర్నలిస్టులకు కరోనా పాజిటివ్..
X

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఒక్క మహారాష్ట్రలోనే కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతోంది. ఆర్థిక రాజధాని ముంబై కరోనా ధాటికి అతలాకుతలమవుతోంది. ఇక్కడ ఎక్కువ సంఖ్యలో జర్నలిస్టులు కరోనా బారిన పడుతున్నట్లు సమాచారం. 167 మంది జర్నలిస్టులకు కరోనా టెస్టులు చేయగా వారిలో 53 మందికి పాజిటివ్ అని తేలింది. వివిధ వార్తా సంస్థలకు చెందిన రిపోర్టర్లు, కెమెరామెన్‌లు ఉన్నట్లు తెలిసింది. వీళ్లెవరికీ కరోనా లక్షణాలేవీ కనిపించకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. అయినా టెస్టుల్లో పాజిటివ్ అని నిర్ధారణ అయింది. కాగా, చెన్నైలో కూడా ముగ్గురు జర్నలిస్టులకు కరోనా సోకింది. అయితే ఎక్కువ కేసులు మాత్రం మహారాష్ట్రలోనే ఉన్నాయి.

Next Story

RELATED STORIES