ఆ ప్రాంతాలలో లాక్‌డౌన్ ఉల్లంఘనే కరోనా కేసులకు ప్రధాన కారణం: కేంద్ర ఆరోగ్య శాఖ
Central health ministry

X
TV5 Telugu20 April 2020 6:47 PM GMT
దేశంలో నాలుగు ముఖ్య నగరాల్లో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. విదేశాలతో పోల్చుకుంటే భారత్ లో కరోనా ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ ముంబై, కోల్‌కతా, ఇండోర్, జైపూర్ నగరాల్లో కేసులు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. అయితే.. ఈ ప్రాంతాలలో ఎక్కువగా కేసులు నమోదవ్వడానికి లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘన ఒక కారణమైతే.. ఆ ప్రాంతాలలో జరిగిన అల్లర్లు మరో కారణమని ఆరోగ్య శాఖ తెలిపింది.
అల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. కేంద్రం తీసుకున్న అతిపెద్ద చర్యల్లో ప్రస్తుత లాక్‌డౌన్ ఒకటని, ప్రజల ఆరోగ్యాన్ని నిలబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నిబద్దతతో పని చేస్తోందని చెప్పుకొచ్చారు.
Next Story