అమెరికాలో చిక్కుకున్న భారత కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌

అమెరికాలో చిక్కుకున్న భారత కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌
X

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ ఆరోరా అమెరికాలో చిక్కుకుపోయారు. వ్యక్తిగత సెలవుపై మార్చి 7న అమెరికా వెళ్లిన సునీల్ ఆరోరా.. ఏప్రిల్ 4న ఇండియాకు రావల్సింది ఉంది. అయితే ఇండియాలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర సర్కార్ లాక్ డౌన్ విధించి అమలు చేస్తోంది. ఈ మహమ్మారిని కట్టడి చేయడంలో భాగంగా మార్చి 23న కేంద్ర ప్రభుత్వం అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసింది. దీంతో సునీల్‌ ఆరోరా అమెరికాలోనే ఉండిపోవాల్సి వచ్చింది.

Next Story

RELATED STORIES