మరో 27 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్

మరో 27 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్
X

కరోనా మహమ్మారి ధాటికి దేశం చిగురుటాకులా వణుకుతోంది. దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. కరోనాపై పోరులో తమ వంతు బాధ్యత నెరవేరుస్తున్న క్రమంలో జర్నలిస్టులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ముఖ్యంగా ముంబైలో ఎక్కువ సంఖ్యలో జర్నలిస్టులు కరోనా బారిన పడ్డారు. ముంబైలో 167 మంది జర్నలిస్టుల శాంపిల్స్‌ను సేకరించి కరోనా టెస్టులు నిర్వహించగా 53 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఫీల్డ్ లో పనిచేసే టీవీ రిపోర్టర్లకే ఎక్కువగా కరోనా సోకిందని అధికారులు తెలిపారు. అటు తమిళనాడులోని ఓ ప్రముఖ న్యూస్‌ ఛానల్‌లో విధులు నిర్వర్తిస్తున్న 27 మంది జర్నలిస్ట్‌లకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. న్యూస్‌ ఛానల్‌లో రిపోర్టర్‌లతో పాటూ డెస్క్‌లో విధులు నిర్వర్తిస్తున్న సబ్‌ ఎడిటర్‌లకు కూడా కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. 24 ఏళ్ల జర్నలిస్ట్‌కి కరోనా పరీక్షల్లో తొలుత పాజిటివ్‌ రావడంతో సదరు న్యూస్‌ ఛానల్‌లో పని చేస్తున్న మొత్తం 94 మందికి కరోనా పరీక్షలు జరిపించారు. మంగళవారం వచ్చిన ఫలితాల్లో 26 మందికి కరోనా సోకినట్టు తేలింది. ప్రస్తుతం వీరిని క్వారంటైన్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.ో ా3ంీల'

Tags

Next Story