మందుబాబులకు గుడ్ న్యూస్.. 'అలా చేస్తే మద్యం షాపులు తెరుస్తాం'

మందుబాబులకు గుడ్ న్యూస్.. అలా చేస్తే మద్యం షాపులు తెరుస్తాం

ఓ వైపు కరోనా మహమ్మారితో ప్రజలు వణిపోతోంటే.. మరో వైపు మద్యం దొరక్క మందుబాబులు అల్లలాడిపోతున్నారు. ప్రాణంతకరమైన కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. అయితే ఈ లాక్‌డౌన్‌తో మద్యం దొరక్క మందుబాబులు పిచ్చెక్కిపోతున్నారు. మద్యం దుకాణాలు మూసేసి నెల రోజులు గడుస్తుండడంతో మద్యం చుక్క కోసం అల్లాడిపోతున్నారు. లాక్‌డౌన్ పూర్తయ్యే వరకూ వైన్‌షాపులు తెరిచే అవకాశం లేకపోవడంతో చేసేది లేక కొందరు సర్దుకుపోతున్నారు. మరికొందరు మాత్రం ప్రభుత్వాలకు మొర పెట్టుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చడానికి, ఉపాధి కల్పించడానికి రాష్ట్రంలో డిస్టిలరీ నుంచి వైన్‌ షాపుల వరకు విడతలవారీగా వ్యాపారం ప్రారంభించడానికి అనుమతించాలని కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆల్కహాలిక్‌ బేవరెజ్‌ కంపెనీస్‌ (సీఐఏబీసీ) మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాక్రేను గతవారం కోరింది. దీంతో మందు బాబులకు గుడ్ న్యూస్ చెప్పారు మహరాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి. భౌతిక దూరం నిబంధనలను కచ్చితంగా అమలుచేస్తే వైన్‌ షాపులను తెరవడానికి అనుమతిస్తామని ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్‌ సృష్టం చేశారు. షాపుల వద్ద భౌతిక దూరం పాటించడంతోపాటు మాస్కులు పెట్టుకోవడం వంటి ముందు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. నిబంధనలు పాటించకపోతే షాపుల లైసెన్సును రద్దు చేస్తామని హెచ్చరించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా సృష్టమైన ఆదేశాలు రావల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించిన ప్రభుత్వం పరిమిత సంఖ్యలో వ్యాపారాలను నిర్వహించుకోవడానికి అనుమతించింది.

Tags

Read MoreRead Less
Next Story