స్వీయ నిర్బంధంలో ఉన్నా.. పరారీలో లేను: తబ్లిగీ జమాత్‌ చీఫ్

స్వీయ నిర్బంధంలో ఉన్నా.. పరారీలో లేను: తబ్లిగీ జమాత్‌ చీఫ్
X

వైద్యుల సలహా మేరకు తాను క్వారంటైన్ లో ఉన్నానని.. అయితే.. తాను పరారైయ్యానని వస్తున్నా వార్తలు రావటం సరికాదని తబ్లీగ్ జమాత్‌ చీఫ్ మౌలానా సాద్ అన్నారు. తబ్లీగ్ జమాత్‌ సభ్యులకు కరోనా వైరస్ పాజిటివ్ రావడం దురదృష్టకరమని.. కానీ.. దేశంలో కరోనా ప్రబలడానికి మర్కజ్ కారణం అవుతుందని ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు. సోమవారం పొడువునా జరిగే.. మత ప్రసంగాలకు అనుమతి పొందాల్సిన అవసరం లేదని అయ్యన అన్నారు. జనతా కర్ఫ్యూ కంటే ముందు గానే జమాత్ సమావేశం నిర్ణయించామని.. అయితే.. కర్ఫ్యూ విధించడంతో కార్యక్రమాన్ని నిలిపివేసి మర్కజ్ ను ఖాళీ చేశామని ఆయన తెలిపారు. ఢిల్లీ పోలీసుల నుంచి నోటీసులు అందాయని, జమాత్ కు విదేశీ నిధులు వస్తున్నాయని ఈడీ కేసు కూడా నమోదైందని ఆయన చెప్పారు. వాటికి సంతృప్తికరమైన వివరణ ఇస్తానన్నారు.

Next Story

RELATED STORIES