క్వారంటైన్ లో ఉండకపోతే రూ.5 కోట్ల 56 లక్షల ఫైన్

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించి అమలు చేస్తోంది. కరోనా లక్షణాలు ఉన్నవారిని.. అనుమానితులను క్వారంటైన్ లో ఉంచుతున్నారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఖచ్చితంగా 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలి. అలాంటి వారంతా ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉండాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రభుత్వ ఆధీనంలోని క్వారంటైన్ సెంటర్‌కు తరలిస్తారు. ఐతే కొందరు అక్కడి నుంచి కూడా తప్పించుకుంటున్నారు. వసతులు బాగాలేవని కొందరు.. కుటుంబ సభ్యులకు దూరంగా ఉండలేక ఇంకొందరు.. క్వారంటైన్ నుంచి పారిపోతున్నారు. సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాల్సిన మరికొందరు బయట తిరుగుతున్నారు. ఇలాంటి వారి కోసం కెనడా ప్ర‌భుత్వం కఠిన నిర్ణ‌యం తీసుకున్న‌ది. సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాల్సిన వాళ్లు బయట కనబడితే మన కరెన్సీలో రూ.2 కోట్ల నుంచి 5 కోట్ల 56 లక్షల వరకు ఫైన్ విధిస్తుంది. దీంతో పాటు మూడేళ్ళ జైలు శిక్ష కూడా విధించ‌నున్నారు. కరోనా నియంత్రణలో కెనడా ప్రభుత్వం ఈ చట్టాన్ని మార్చి 25 నుంచి అమల్లోకి తెచ్చింది. విదేశాల నుంచి వచ్చిన ఎవరైనా సరే రెండు వారాలు బయట కనిపిస్తే ఈ ఫైన్, జైలు రెండూ ఖాయం. విదేశాల నుంచి వచ్చిన వారు ఇళ్ళల్లో వుంటున్నారా లేదా అని చూసేందుకు కెనడా పబ్లిక్ ఏజెన్సీ, పోలీస్ శాఖకు ఆ వివరాలు అందజేస్తున్న‌ది. పోలీసులు ప్రతి మూడు గంటలకు ఒకసారి ఆ ఇల్లు చెక్ చేసి వాళ్లు లోపల ఉన్నారా లేదా అని పరిశీలిస్తారు. ఒకవేళ ఇంట్లో లేకపోతే రెండో ప్రత్యామ్నాయం లేకుండా వారు ఎక్కడ వున్నారో పట్టుకుని అటునుంచి అటే నేరుగా జైలుకి తీసుకెళతారు.

Tags

Read MoreRead Less
Next Story