వలస కార్మికుల విషయంలో ఒక అవకాశం ఇవ్వండి: కేంద్రానికి అశోక్ గెహ్లాట్ విజ్ఞప్తి

వలస కార్మికుల విషయంలో ఒక అవకాశం ఇవ్వండి: కేంద్రానికి అశోక్ గెహ్లాట్ విజ్ఞప్తి

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉన్న రాజస్థాన్ వలస కార్మికులను స్వరాష్ట్రానికి తీసుకొని వచ్చేందుకు అనుమతినివ్వాలని సీఎం అశోక్ గెహ్లాట్ ప్రధాని మోడీని కోరారు. అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గోవా, కేరళ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో లాక్‌డౌన్ కారణంగా చాలామంది చిక్కుకున్నారని.. వారిని సొంత రాష్ట్రానికి తీసుకొని వస్తే.. వారు వారి కుటుంబ సభ్యులతో కలిసి కొంత కాలం ఉంటారని అన్నారు. లాక్‌డౌన్ నిబంధనలు ఎత్తివేసిన వెంటనే తిరిగి వెళ్ళిపోతారని.. ఇది ఆర్థిక వ్యవస్థకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.

లాక్‌డౌన్ కు ముందు దేశంలో ఉన్న విదేశీయులను పంపించేసి.. విదేశాల్లో ఉన్న మన జాతీయులను స్వదేశానికి తీసుకొని వచ్చారని అయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇలాంటి చొరవ దేశంలో ఉన్న వలస కూలీలా విషయంలో కూడా చూపిస్తే బాగుంటుందని అన్నారు. ఈ విషయం గురించి ఇప్పటికే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తో మాట్లాడానని.. ఆయన దీనిపై అలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారని అశోక్ గెహ్లాట్ తెలిపారు.

అయితే ఇదే రకమైన డిమాండ్ పలు రాష్ట్రాలు తెర మీదకు తెస్తున్నాయి. జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలు కూడా ఇతర రాష్ట్రాల్లోని తమ ప్రజలను తిరిగి తీసుకొచ్చుకునేందుకు అనుమతివ్వాల్సిందిగా కేంద్రాన్ని కోరుతున్నాయి. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు రాష్ట్రాలు ప్రత్యేక బస్సుల ద్వారా వెనక్కు తీసుకెళ్లాయి. దీంతో మిగిలిన రాష్ట్రాలకు చెందని వలస కార్మికులు, విద్యార్థులు కూడా తమను సొంత రాష్ట్రాలకు తీసుకెళ్లాలంటూ తమ రాష్ట్రాల ప్రభుత్వాలపై ఒత్తిడి చేయడం ప్రారంభించారు.

Tags

Read MoreRead Less
Next Story