గుడ్ న్యూస్: భారత్ లో ఒక్కరోజే 705 మంది డిశ్చార్జ్

గుడ్ న్యూస్: భారత్ లో ఒక్కరోజే 705 మంది డిశ్చార్జ్

సోమవారం ఒక్కరోజే 705 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని..కేంద్ర ప్రభుత్వం హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసి తెలిపింది. ఇప్పటివరకు భారత్ లో 18,601 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. సోమవారం కోలుకున్న వారితో కలిపి మొత్తం ఇప్పటివరకు 3,252 మంది డిశ్చార్జ్ అయ్యారని ఆయన తెలిపారు. భారత్‌లో కరోనా నుంచి కోలుకుంటున్న వారి శాతం 17.48గా లవ్ అగర్వాల్ ప్రకటించారు.

గత 14 రోజుల్లో 61 జిల్లాలలో కొత్తగా కరిస్తోన్న కేసులు నమోదు కాలేదని.. తాగాజా ఈ జాబితాలో మరో 4 జిల్లాలు చేరినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనాను నయం చేసే దిశగా 5 వ్యాక్సిన్స్‌లను 70 మందిపై ప్రయోగించినట్లు ఐసీఎమ్‌ఆర్ తెలిపింది.

అటు కరోనా కట్టడికి కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఆసుపత్రుల్లో కరోనాతో పాటు హెచ్‌ఐవీ, క్యాన్సర్ వ్యాధులకు కూడా చికిత్స అందించాలని సూచించింది.

Tags

Read MoreRead Less
Next Story