జంతువుల నుంచే కరోనా.. కన్ఫామ్ : డబ్ల్యూహెచ్‌వో

జంతువుల నుంచే కరోనా.. కన్ఫామ్ : డబ్ల్యూహెచ్‌వో

వూహాన్ నుంచి వచ్చిన కరోనా విశ్వవ్యాప్తమైంది. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఈ వైరస్ అసలు వేటి నుంచి వచ్చింది.. అంటే మనుషుల నుంచి సంక్రమించిందా లేక జంతువుల నుంచా అనేదానిపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఫ్యాక్స్ అందించిన సమాచారం ప్రకారం వూహాన్ ల్యాబరేటరీలో పరిశోధనలు సాగిస్తున్న ఒక మహిళా ఉద్యోగికి ఈ వైరస్ సంక్రమించిందని. ఆమె నుంచి మరొకరికి.. ఇలా వందలు, వేలు, లక్షల కరోనా కేసులు రోజూ వెలుగు చూస్తున్నాయి.

అయితే తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌)సమాచారం ప్రకారం కరోనా వైరస్ పుట్టుకకు కారణం జంతువులే అని తేల్చి చెబుతోంది. కానీ ఏం జంతువునుంచి వచ్చింది అనేది ఇంకా నిర్ధారించలేదు. కరోనా కారకాలు గబ్బిలాలలోనే ఎక్కువగా ఉన్నాయని.. వాటి నుంచి మనుషులకు ఎలా వ్యాపించింది అనే విషయాన్ని పరిశోధించవలసి ఉందని సంస్థ అధికార ప్రతినిధి ఫడెలా చైబ్ తెలిపారు. ఈ వైరస్ ఎలా వ్యాపించింది అనే విషయం చెప్పేందుకు మాత్రం ఆమె నిరాకరించారు.

కరోనా అంతు చూస్తాం.. ఎక్కడినుంచి వచ్చిందో కనిపెట్టేస్తాం అని చెబుతున్న అమెరికా అధ్యక్షుడు గత వారం ప్రకటించిన నేపథ్యంలో.. ఇప్పుడు డబ్ల్యూహెచ్‌వో ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచ మానవాళిని పెనుభూతంలా పట్టి పీడిస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో డబ్ల్యూహెచ్‌వో విఫలమైందని ఆరోపిస్తూ.. సంస్థకు ఇచ్చే నిధులు సైతం నిలిపివేస్తామన్నారు ట్రంప్.

ఈ వాఖ్యలకు ఫడెలా వివరణ ఇస్తూ.. ట్రంప్ నిర్ణయానికి అనుగుణంగా పరిస్థితులను అంచనా వేస్తామన్నారు. మిగిలిన భాగస్వాములతో కలిసి ఆర్ధిక లోటును భర్తీ చేస్తామన్నారు. డబ్ల్యూహెచ్‌వో తన కార్యకలాపాలు కొనసాగించడం ఎంతో ముఖ్యం. ఈ సంస్థ కేవలం కరోనా నియంత్రణ కోసం పని చేస్తున్నది కాదు. ఎన్నో ఇతర ఆరోగ్య కార్యక్రమాలు చేపడుతోందని ఆమె అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story