క్వారంటైన్‌ సెంటర్‌లో అగ్నిప్రమాదం

కరోనా మహమ్మారి దేశ ఆర్థిక రాజధాని ముంబైని అతలాకుతలం చేస్తోంది. కరోనాతో ముంబైలో ప్రజలు వణికిపోతున్నారు. రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ సోకిన బాధితులను క్వారంటైన్‌ సెంటర్‌ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ సమయంలో ఓ క్యారంటైన్ సెంటర్ లో ఆగ్రిప్రమాదం జరిగింది. దక్షిణ ముంబైలోని నగ్పదా ప్రాంతంలోని రిప్పన్‌ హోటల్‌లో మంగళవారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకుని.. రెండు అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పివేస్తున్నాయి. మూడు అంతస్తుల ఈ భవనంలోని లాడ్జింగ్‌ రూం వరకే మంటలు పరిమితమవడంతో పెను ప్రమాదం తప్పింది. రోగులందరినీ అక్కడి నుంచి సురక్షితంగా ఖాళీచేయించామని అధికారులు తెలిపారు.

Next Story

RELATED STORIES