వైద్యులపై దాడులకు దిగితే సహించం: నవీన్ పట్నాయక్

వైద్యులపై దాడులకు దిగితే సహించం: నవీన్ పట్నాయక్

ఆరోగ్య సిబ్బందిపై దాడులు చేసేవారిపై జాతీయ భద్రత చట్టం కింద కఠిన చర్యలు తప్పవని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ హెచ్చరించారు. వైద్యులు చేస్తున్న సేవకు వారితో కృతజ్ఞతా భావంతో మెలగాలని.. దాడులకు దిగితే సహించబోమని స్పష్టం చేశారు. అటు కరోనా రోగులకు చికిత్సనందిస్తున్న వైద్య సిబ్బందికి పెద్ద పీట వేయనున్నట్టు నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా రోగులకు వైద్యం చేస్తూ ఎవరైనా మృతి చెందితే.. రూ. 50 లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించారు. అంతే కాదు ఆవిధంగా చనిపోయిన వారికి అమరులుగా గుర్తించి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తామని అన్నారు. జాతీయ దినాల్లో వారికి అవార్డులు కూడా అందిస్తామని, ఇందుకోసం వివరాణత్మక అవార్డుల పథకాన్ని ప్రారంభిస్తామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story