వైద్యులపై దాడులు అరికట్టడానికి కొత్తగా ఆర్డినెన్స్ తెస్తాం: ప్రకాశ్ జవదేకర్

వైద్యులపై దాడులు అరికట్టడానికి కొత్తగా ఆర్డినెన్స్ తెస్తాం: ప్రకాశ్ జవదేకర్
X

డాక్టర్లు, వైద్య సిబ్బందిపై దాడికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ప్రధాని నివాసంలో జరిగిన కేబినెట్ సమావేశం తరువాత ఆయన పలు సూచనలు చేశారు. ప్రధానితో జరిగిన సమావేశంలో కరోనా, లాక్‌డౌన్‌, ఆర్థిక వ్యవస్థపై చర్చించామని తెలిపారు. వైద్య సిబ్బందిపై దాడులను అరికట్టేందుకు త్వరలో ఆర్డినెన్స్‌ తేబోతున్నామని ప్రకటించారు. దాడులకు పాల్పడిన వారికి 5 వేలు నుంచి.. 2 లక్షల జరీమానాతో పాటు 3 నెలల నుంచి 5 సంవత్సరాల వరకు జైలుశిక్ష తప్పదని హెచ్చరించారు. బెయిల్ కూడా ఇవ్వబోమని తేల్చి చెప్పారు. తీవ్రంగా గాయపరిచిన వారికి మాత్రం ఆరు నెలల నుంచి ఏడేళ్ల వరకు జైలుశిక్షతో పాటు.. రూ.లక్ష నుంచి రూ.5లక్షల జరిమానా విధిస్తామన్నారు. అటు 30 రోజుల్లోనే ఈ దాడులకు సంబందించిన దర్యాప్తు పూర్తి చేస్తామని చెప్పారు. వైద్యులు, ఆశావర్కర్లు, సిబ్బందికి రూ.50లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు జవదేకర్‌ తెలిపారు.

Next Story

RELATED STORIES