92ఏళ్ళ బామ్మ పక్షవాతంతో బాధపడుతోంది.. అయినా కరోనాను జయించింది

92ఏళ్ళ బామ్మ పక్షవాతంతో బాధపడుతోంది.. అయినా కరోనాను జయించింది

92ఏళ్ళ బామ్మ ముందు కరోనా వైరస్ ఓడిపోయింది. గత కొంత కాలంగా పక్షవాతంతో బాధపడుతున్న ఆమెకు కొన్ని రోజుల క్రితం కరోనా సోకింది. అయితే.. 14 రోజుల క్వారంటైన్ తరువాత ఆమె కోలుకొని ఆరోగ్యంగా ఇంటికి చేరింది.

ఏప్రిల్ నెల మొదటి వారంలో ఈ బామ్మతో పాటు ఆమె ఇంట్లో నలుగురికి కరోనా సోకింది. దీంతో వారిని పుణేలోని సింబోసిస్ ఆస్పత్రిలో చేర్చించారు. అయితే 14 రోజుల క్వారంటైన్ తరువాత ఆమెకు కరోనా టెస్టులో నెగటివ్ అని తేలింది. ఆమె గత 7 నెలల నుంచి పక్షవాతంతో భాద పడుతూ మంచానికి ప్రతిమితమైపోయింది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆమె కోలుకోవటంతో ఆస్పత్రి వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వృద్దులకు కరోనా సోకితే.. చనిపోతారని అందరూ భయపడుతున్నారని.. కానీ.. అలా బయపడాల్సిన అవసరం లేదని సింబోసిస్ యూనివర్సిటీ హాస్పిటల్ సీఈవో డాక్టర్ విజయ్ నటరాజన్ అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story