ఫస్ట్ లాక్‌డౌన్‌తో 12కోట్ల మంది నిరుద్యోగులయ్యారు: సోనియాగాంధీ

ఫస్ట్ లాక్‌డౌన్‌తో 12కోట్ల మంది నిరుద్యోగులయ్యారు: సోనియాగాంధీ
X

కరోనా పేరుతో ద్వేషము, మతతత్వమనే వైరస్‌లను బీజేపీ వ్యాపింప చేస్తోందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆరోపించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీతో సమావేశమైన ఆమె మొదటి లాక్‌డౌన్‌తోనే 12 కోట్ల మంది ఉపాధి కోల్పోయారని.. ప్రతి కుటుంబానికి 7500 రూపాయలు ఇచ్చి వారిని ఆదుకోవాలని కేంద్రాన్ని ఆమె డిమాండ్ చేశారు.

దేశంలో కరోనా టెస్టులు అతి తక్కువ సంఖ్యలో జరుగుతున్నాయని.. చాలా ఎక్కువగా జరగాల్సిన అవసరముందని అన్నారు. పీపీఈ కిట్లు నాసిరకానివి వాడుతున్నారని సోనియా ఆరోపించారు. ప్రత్యక్షముగా కరోనాతో పోరాటం చేస్తున్న వైద్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, స్వచ్ఛంద సేవా సంస్థల కార్యకర్తలు అభినందనీయులని సోనియా అన్నారు.

Next Story

RELATED STORIES