దేశంలో గత 24 గంటల్లో 1409 కరోనా పాజిటివ్ కేసులు

X
TV5 Telugu23 April 2020 6:39 PM GMT
భారత్‌లో గత 24 గంటల్లో 1409 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య 21,393కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. తాజాగా కేంద్రం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం ఇప్పటివరకూ 4,257 మంది కరోనా నుంచి కోలుకోగా.. 16,454 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు.
దేశవ్యాప్తంగా గత 28 రోజులుగా 12 జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కాలేదని.. మరో 78 జిల్లాల్లో గత 14 రోజులుగా ఎలాంటి కొత్త కేసు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. భారత్‌లో కరోనా నుంచి కోలుకుంటున్న వారి శాతం ప్రస్తుతం 19.89గా కేంద్రం ప్రకటించింది.
Next Story