హైదరాబాద్‌లో ఆ పది ఏరియాలు..

హైదరాబాద్‌లో ఆ పది ఏరియాలు..
X

గ్రేటర్ హైదరాబాద్‌లో మొత్తం మూడు కమిషనరేట్‌లు.. 141 లా అండ్ ఆర్డ్రర్ పోలీస్ స్టేషన్‌లు ఉన్నాయి. నగరంలో ఇప్పటి వరకు నమోదైనా కరోనా పాటిజివ్ కేసుల సంఖ్య 436 కాగా, అందులో 233 కేసులు పది ఏరియాల పరిధిలోనివి కావడం గమనార్హం. మొత్తం మహానగరంలో సగం ముప్పు ఆయా ఏరియాల్లోనే పొంచి ఉందని తెలుస్తోంది.

భవానీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పటి వరకు 41 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

తలాబ్ కట్టలో నివసిస్తున్న ఓ వృద్ధురాలు ఇటీవల అనారోగ్యకారణాలతో మృతి చెందారు. అంతకు ముందే తీసుకున్న ఆమె రక్తనమూనాలు కరోనా పాజిటివ్ అని తేలడంతో కుటుంబ సభ్యులందరికీ పరీక్షలు నిర్వహించారు. వారిలో 17 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆమెకు చికిత్స అందించిన వైద్య సిబ్బందిలో మరో 17 మందికి పాజిటివ్ అని తేలింది. ఇక ఇదే ప్రాంతానికి చెందిన మరో ఏడుగురికి కూడా పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. వృద్దురాలి కుటుంబంలోనే 31 మందికి పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తోంది. ఇంకా పాజిటివ్ వచ్చిన వారిలో ఒక డాక్టరు, ఇద్దరు నర్సులు కూడా ఉన్నారు.

రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వృద్దురాలు మృతి చెందింది. ఆమెకు పాజిటివ్ అని తేలడంతో.. కుటుంబ సభ్యులను పరిక్షించారు. మొత్తం 10 మంది ఈ వైరస్ బారిన పడ్డట్టు తేలింది. ఇక ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మరో 17 మందికి ఈ వైరస్ సోకింది.

కాలాపత్తర్లో నివసిస్తున్న ఓ వృద్దురాలు చికిత్స పొందుతూ మరణించింది. ఆమెకు, కుటుంబసభ్యుల్లోని 10 మందికి పాజిటివ్ అని తేలింది. అదే బస్తీలో ఉండే మరో 11 మందికి పాజిటివ్.

ఇక అన్నిటికంటే ఆసిఫ్ నగర్ పీఎస్‌లో 47పాజిటివ్ కేసులు నమోదై అగ్రస్థానంలో నిలిచింది. కరోనాతో ఇప్పటికే ఇక్కడ ముగ్గురు మృతి చెందారు. దీంతో ఆ ఏరియాలోని 7 ప్రాంతాలను కట్టుదిట్టం చేశారు. అయినప్పటికీ కేసుల సంఖ్య పెరగండం ఆందోళన కలిగిస్తోంది.

మెహదీపట్నం ప్రాంతంలో నివసిస్తున్న ఓ డాక్టర్ కుటుంబానికి కరోనా సోకింది. కుటుంబంలో ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది.

కామాటిపురాలో 50ఏళ్ల వ్యక్తికి పాజిటివ్ అని తేలడంతో కుటుంబం మొత్తానికి టెస్ట్ చేయగా 9 మందికి పాజిటివ్ అని తేలింది.

ఢిల్లీ నుంచి ఓ మహిళ నగరానికి వచ్చింది తన స్నేహితురాలింటికి. ఆమెను పరీక్షించగా పాజిటివ్ అని తేలింది. ఆమెతో పాటు స్నేహితురాలికి మరో ఇద్దరికీ కూడా పాజిటివ్.

డబీర్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలో 14 మంది, ఛాదర్‌ఘాట్ ఏరియాలో 18 మందికి, చంపాపేట్ డివిజన్ పరిధిలోని బ్యాంక్ ఉద్యోగికి, గోల్కొండ ఏరియాలో ఒకరికి, హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 9 పాజిటివ్ కేసులు, హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 14 మందికి సోకగా, ఓ యునానీ వైద్యుడు మృతి చెందాడు. కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 20 పాజిటివ్ కేసులు నమోదు కాగా నలుగురు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఒకరు మృతి చెందారు.

Next Story

RELATED STORIES