ప్లాస్మా చికిత్స ద్వారా ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి: ఢిల్లీ సీఎం

ప్లాస్మా చికిత్స ద్వారా ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి: ఢిల్లీ సీఎం
X

దేశవ్యాప్తంగా కరోనా రోగులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఒక శుభవార్త చెప్పారు. ప్లాస్మా చికిత్స ద్వారా ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని తెలిపారు.

ఢిల్లీ ప్రభుత్వం క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా నలుగురికి ప్లాస్మా చికిత్సనందిస్తోంది. ప్లాస్మా థెరపీకి సంబంధించి తొలి దశ ఫలితాలు వచ్చినట్లు ఆయన తెలిపారు. మరో ఇద్దరు ముగ్గురికి చికిత్సనందించేందుకు కరోనా నుంచి కోలుకున్న వారి రక్తం, ప్లాస్మా సేకరించామని.. మరో ఇద్దరు ముగ్గురికి ప్లాస్మా చికిత్సనందిస్తామని అన్నారు. కరోనా నుంచి కోలుకున్న వారు స్వచ్ఛందంగా వచ్చి రక్తాన్ని దానం చేయాలని సీఎం పిలుపునిచ్చారు.

ఢిల్లీలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ కరోనా బాధితుడు ఈ చికిత్స ద్వారా కోలుకున్నాడు. వెంటిలేటర్‌పై అతడికి ప్లాస్మా థెరపీని అందించారు. ఇది ఫలితమివ్వడంతో అతడు కోలుకున్నాడు. దీంతో అతడికి అమర్చిన వెంటిలేటర్‌ను డాక్టర్లు తొలగించారు. వెంటిలేటర్‌పై ఉన్న రోగులకు ప్లాస్మా థెరపీ ద్వారా మంచి ఫలితాలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు.

Next Story

RELATED STORIES