అజాజ్ ఖాన్‌కు బెయిలు

అజాజ్ ఖాన్‌కు బెయిలు
X

నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించారననే ఆరోపణలపై ఈనెల 18న అరెస్టైన అజాజ్ ఖాన్‌కు బాంద్రా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు బెయిలు మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచీకత్తుపై బెయిలుకు అనుమతించింది. తబ్లిగి జమాత్ సభ్యులకు మద్దతుగా పేస్ బుక్ లైవ్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు .. వివాదాస్పదంగా ఉన్నాయని.. రెండు వర్గాల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయని ఆయనను సెక్షన్ 153ఏతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఎజాజ్ ఖాన్ గతేడాది జులైలోనూ ఓసారి అరెస్టయ్యాడు. వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచేలా ఉన్న వీడియోలను పోస్టు చేసినందుకు గాను గతంలో పోలీసులు అరెస్ట్ చేశారు.

Next Story

RELATED STORIES