పనిచేయని రాపిడ్ కిట్లను పంపించేస్తాం: కేంద్రం

పనిచేయని రాపిడ్ కిట్లను పంపించేస్తాం: కేంద్రం

కరోనా రాపిడ్ టెస్టింగ్ కిట్లకు ఇంకా పూర్తిగా చెల్లింపులు చేయలేదని.. పనికిరాని టెస్టింగ్ కిట్లన్నింటినీ తిరిగి పంపించివేస్తామని కేంద్రం తెలిపింది. చైనా నుంచి కొనుగోలు చేసిన కరోనా రాపిడ్ టెస్టింగ్ కిట్లు సరిగా పని చేయడం లేదంటూ ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్దన్ మీడియాతో మాట్లాడి ఈ మేరకు స్పష్టతనిచ్చారు.

కరోనా పరీక్షల కోసం చైనా, దక్షిణ కొరియా, సింగపూర్‌ల నుంచి భారత్ దాదాపు 37 లక్షల కరోనా రాపిడ్ టెస్టింగ్ కిట్లను ఆర్డర్ చేసింది. అయితే.. వీటిలో 7 లక్షల కిట్లు చైనా ఇప్పటికే భారత్‌కు అందించింది. ఇందులో చాలా వరకు పని చేయడం లేదంటూ అస్సాం, రాజస్థాన్ వంటి పలు రాష్ట్రాల నుంచి ఫిర్యాదులు అందాయి. దీంతో వెంటనే స్పందించిన కేంద్రం.. రాపిడ్ కిట్లతో టెస్టులు చేయవద్దని రాష్ట్రాలకు ఆదేశించింది.

Tags

Read MoreRead Less
Next Story