దేశంలో కరోనా రహిత రాష్ట్రాలు ఇవే..

దేశంలో ఒకవైపు కరోనా వేగంగా వ్యాపిస్తూ ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు వైరస్ కేసులు కొన్ని ప్రాంతలకే పరిమితం కావడం ఊరటనిస్తోంది. వైరస్ వ్యాప్తిని చాలా రాష్ట్రాలు సమర్థవంతంగా అడ్టుకుంటున్నాయి. కరోనాపై పోరాటంలో విజయం సాధిస్తున్నాయి. ఇప్పటి వరకు దేశంలో కరోనా రహిత రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య తొమ్మిదికి చేరింది. అరుణాచల్‌ప్రదేశ్, గోవా, మణిపూర్, నాగాలాండ్, సిక్కిం, డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీ, లక్ష్యదీప్, త్రిపురను కరోనా రహిత రాష్ట్రలుగా ఆయా ప్రభుత్వాలు ప్రకటించాయి. ఈ ప్రాంతాల్లో కరోనా అనుమానితులు నెగెటివ్‌లుగా తేలారు. దీంతో ఇవన్నీ కరోనా రహిత ప్రాంతాలు గుర్తింపు పొందాయి. దేశంలో తొలి రెండు కరోనా రహిత రాష్ట్రాలుగా గోవా, మణిపూర్ నిలిచాయి. కరోనా రహిత తొమ్మిదో రాష్ట్రంగా త్రిపుర గుర్తింపు పొందింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com