ఓయూ డిగ్రీ, పీజీ పరీక్షా ఫలితాలు వెల్లడి..

ఓయూ డిగ్రీ, పీజీ పరీక్షా ఫలితాలు వెల్లడి..

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ డిగ్రీ, పీజీ కోర్సుల పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ విషయాన్ని ఓయూ కంట్రోలర్‌ ఆఫ్‌ ది ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ శ్రీరాం వెంకటేశ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, బీఎస్‌డబ్ల్యూ తదితర కోర్సుల మొదటి, మూడో, అయిదో సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షల రివాల్యుయేషన్‌ ఫలితాలను ఓయూ వెబ్‌సైట్‌ www.osmania.ac. in లో ఉంచినట్లు ఆయన తెలిపారు. ఆర్కియాలజీ, ఉర్దూ, పర్షియన్‌, మరాఠీ, ఫిలాసఫీ, ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌, హిస్టరీ, ఇంగ్లిష్‌ విభాగాల్లో ఎంఏ, ఎమ్మెస్సీ ఎలక్ట్రానిక్స్‌, ఎం.కాం మొదటి సెమిస్టర్‌ పరీక్షా ఫలితాలు విడుదల చేసినట్లు వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story