దోమ వల్ల కరోనా ఏందయ్యా?.. బిగ్‌బిపై నెటిజన్ల విమర్శలు

దోమ వల్ల కరోనా ఏందయ్యా?.. బిగ్‌బిపై నెటిజన్ల విమర్శలు
X

దోమ గురించి ట్వీట్ చేసి.. సోషల్ మీడియా వేదికగా బిగ్‌బి అమితాబ్ బచ్చన్ విమర్శల పాలు అవుతున్నారు. అన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించిన వ్యక్తి అంత అవగాహనా రాహిత్యంగా మాట్లాడటం సరికాదని మండిపడుతున్నారు. ఓ దోమ తన గదిలోకి దూరిందని.. విచ్చలవిడిగా సంచరిస్తున్న ఆ కరోనా వైరస్ తనను ఒంటరిగా ఉండనీయడం లేదంటు ట్వీట్‌లో వ్యాఖ్యానించారు. దోమ వల్ల కరోనా వ్యాపించదని ప్రూవ్ చేస్తూ.. ఓ ఐఎఫ్ఎస్ అధికారి కౌంటర్ ఇచ్చారు. దోమ ఏం శత్రువు కాదని, దోమ వల్ల కరోనా వైరస్ వ్యాపించదని బిగ్‌బి గుర్తించాలని మరో నెటిజన్ రీ ట్వీట్ చేశారు. ఇలా బిగ్‌బి ట్వీట్‌పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

Next Story

RELATED STORIES