ముంబైలో కరోనాతో మరో పోలీస్‌ కానిస్టేబుల్‌ మృతి

ముంబైలో కరోనాతో మరో పోలీస్‌ కానిస్టేబుల్‌ మృతి
X

మహారాష్ట్రలో కరోనావైరస్ విజృంభిస్తోంది. ఆర్థిక రాజధాని ముంబైలో ఈ మహమ్మారి బారిన పడి వేలాది మంది బాధపడుతున్నారు. ఈ ప్రాణాంతకర వైరస్ వందలాది మందిని పొట్టన బెట్టుకుంటుంది. తాజాగా కరోనా బారిన పడి ముంబైలో 52 ఏళ్ల పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందారు. దీంతో గత 24 గంటల్లో ఈ వైరస్‌ ప్రభావంతో మరణించిన ముంబై పోలీసుల సంఖ్య రెండుకు చేరింది.

ప్రొటెక్షన్‌ బ్రాంచ్‌కు చెందిన 52 ఏండ్ల సందీప్‌ సర్వీ హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన కరోనాతో పోరాడుతున్నారు. వైరస్‌ లక్షణాలతో ఏప్రిల్‌ 23న నగరంలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చేరారు. ఆదివారం ఉదయం 7.30గంటల ప్రాంతంలో కన్నుమూశారు. ఈ కరోనా మహమ్మారి బారిన పడి శనివారం సాయంత్రం 57 ఏళ్ల పోలీస్‌ కానిస్టేబుల్‌ ముంబైలోని హాస్పిటల్‌లో మృతి చెందారు.

Next Story

RELATED STORIES