ఒకే కుటుంబంలో 18 మందికి కరోనా పాజిటివ్

ఒకే కుటుంబంలో 18 మందికి కరోనా పాజిటివ్
X

దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఉత్తరప్రదేశ్ పై న కూడా ఈ కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రోజు రోజుకూ అక్కడ కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే తాజాగా ఒకే కుటుంబంలో 18 మందికి కరోనా సోకడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

యూపీలోని దియోబంద్ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థి గత నెలలో యూనివర్శిటీ నుంచి సంత్ కబీర్ నగర్ లోని తన సొంత ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వచ్చిన కొన్ని రోజులకు ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా పాజిటివ్ రావడంతో ఆ వ్యక్తిని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

అయితే, అతని కుటుంబ సభ్యులను, బంధువులను క్వారంటైన్ కు తరలించి టెస్టులు చేశారు. పరీక్షల్లో కుటుంబంలోని 18 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఒకే కుటుంబానికి చెందిన 18 మందికి కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఒకే కుటుంబంలో ఇంతమందికి కరోనా పాజిటివ్ అని తేలడంతో.. సంత్ కబీర్ నగర్ లో భయాందోళనలు నెలకొన్నాయి.

Next Story

RELATED STORIES