తప్పనిసరి పరిస్థితుల్లోనే హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడాలి: ఎఫ్‌డీఏ

తప్పనిసరి పరిస్థితుల్లోనే హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడాలి: ఎఫ్‌డీఏ

అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ హైడ్రాక్సీ క్లోరోక్విన్ విషయంలో పలు కీలక సూచనలు చేసింది. కరోనా చికిత్సకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ సూచించే ముందు.. వైద్యులు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. దీనిని వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కనిపించే ప్రమాదం ఉందని అన్నారు. గుండె అపసవ్యంగా కొట్టుకోవడం వంటి దుష్ప్రభావాలు వంటి లక్షణాలు దీనిని వాడటం వలన కనిపిస్తాయని సూచించారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇవ్వాలని తెలిపింది. ఒక వేళ దీనిని వాడినా.. రోగి ఆరోగ్యస్థితిని నిరంతరం గమనిస్తూ ఉండాలని తెలిపింది.

ప్రస్తుతం కరోనాకు ఎలాంటి మందు లేకపోవడం వలన హైడ్రాక్సీక్లోరోక్విన్ ను వాడుతున్నారు. అయితే.. ఇది ఎంత వరకు పని చేస్తుందనే దానిపై అమెరికాలో పలు అధ్యయనాలు జరుగుతున్నాయి. మరికొన్ని అధ్యయనాలను పట్టాలేక్కించే దిశగా అనే అనేక సంస్థలు అడుగులు వేస్తున్నాయి. ఇక ప్రస్తుతానికి కరోనా చికిత్పలో హెచ్‌సీక్యూ‌పై ఎంతమేరకు ఉపయోగపడుతుందనే దానిపై స్పష్టత లేనందుకు వైద్యులు..హెచ్‌సీక్యూ సైడ్ ఎఫెక్ట్స్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని ఎఫ్‌డీఏ సూచించింది.

Tags

Read MoreRead Less
Next Story