ఎక్కువ కేసులు నమోదైనా ఆందోళన అవసరం లేదు: రాజీబ్ గౌబ

ఎక్కువ కేసులు నమోదైనా ఆందోళన అవసరం లేదు: రాజీబ్ గౌబ
X

కరోనా వైరస్ కేసులు దాచవద్దని.. కేసులు ఎక్కువగా నమోదవుతున్నా.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేబినెట్ సెక్రటరీ రాజీబ్ గౌబ అన్నారు. అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. కరోనా నియంత్రణలో గణనీయమైన మార్పు కనబడుతోందన్నారు. కొన్ని రాష్ట్రాల్లో అధికంగా టెస్టులు చేయడంతో కేసులు ఎక్కువ నమోదవుతున్నాయని.. హాట్‌స్పాట్‌, కంటైన్మెంట్‌ జోన్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా లాక్‌డౌన్‌ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని సీఎస్‌లను రాజీవ్‌గౌబ ఆదేశించారు.

Tags

Next Story