సాధువుల హత్యలపై సీబీఐ విచారణ జరిపించాలని సంత్ సమితి డిమాండ్

సాధువుల హత్యలపై సీబీఐ విచారణ జరిపించాలని సంత్ సమితి డిమాండ్
X

పాల్‌ఘర్‌లో సాధువుల హత్యలపై సీబీఐ విచారణ జరిపించాలని సంత్ సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసి నక్సలైట్లు, మిషనరీలు కలిసి సాధువులను హత్య చేశాయని ఆరోపిచారు.

ఏప్రిల్ 16 రాత్రి పాల్‌ఘర్ గడ్చింధాలి గ్రామం వద్ద సాధువుల వాహనంపై దుండగులు రాళ్లు, కర్రలు, రాడ్లతో దాడి చేశారు. వాహనంలో ఉన్న ఇద్దరు సాధువులను, డ్రైవర్‌ను కొట్టి చంపారు. మరణించిన సాధువులను కల్పవృక్ష గిరి మహరాజ్, సుశీల్ గిరి మహరాజ్‌గా గుర్తించారు. పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ.. వారు అడ్డుకోలేదని వారు చెబుతున్నారు. అయితే, దొంగలనే పుకార్లు రావడం వల్లే దుండగులు దాడి చేశారని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేసింది. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే.. సీఐడీ విచారణకు ఆదేశించినట్లు ప్రకటించారు.

అయితే.. తాజాగా ఈ హత్యలపై సీబీఐ విచారణ జరిపించాలని సంత్ సమితి ప్రధాని నరేంద్రమోడీని కోరింది.

Next Story

RELATED STORIES