ఇన్నాళ్లు ఓ విధంగా బతికాం.. ఇప్పుడైనా మారాలి: సురేష్ బాబు

ఇన్నాళ్లు ఓ విధంగా బతికాం.. ఇప్పుడైనా మారాలి: సురేష్ బాబు

కరోనా.. మనకు చాలా నేర్పుతోంది. ఇన్నాళ్లు ఓ విధంగా బతికాం.. ఇప్పుడు మారాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటున్నారు ప్రముఖ నిర్మాత సురేష్‌ బాబు. లాక్‌డౌన్ కారణంగా అందరూ ఇళ్లలోనే ఉంటున్నారు. దాదాపు అందరూ బోర్ కూడా ఫీలవుతున్నారు. ఇప్పటికిప్పుడు లాక్‌డౌన్ ఎత్తివేసినా ఎవరూ పొలో మని థియేటర్లకు వెళ్లే పరిస్థితి లేదు. అలా అని సామాజిక దూరం పాటిస్తూ సినిమా చూడడాన్ని ఎంజాయ్ చేయలేరు. ఇక ఇలాంటి పరిస్థితిలో సినిమాలు తీయాలన్నా చాలా కష్టం. షూటింగ్ అంటేనే దాదాపు ఓ వంద మంది టీమ్ కలసి పని చేయాల్సి ఉంటుంది. షూటింగ్‌లు ఎలా చేయాలి.. జనాన్ని థియేటర్‌కు ఎలా రప్పించాలి అనే విషయాలు ఆలోచించాలి.

పరిస్థితి కాస్త చక్కబడ్డాక 20,30 మందితో కలిసి చిన్న, మీడియం సినిమాల షూటింగ్ చేయడం మొదలు పెడతాం. వీలైతే వాటిని ముందుగా ఓటీటీ ప్లాట్‌ఫాంలో విడుదల చేస్తాం అంటున్నారు. ఎవరైనా సరే మార్పుల్ని అంగీకరిస్తేనే మంచి భవిష్యత్ ఉంటుందని అన్నారు. దాదాపు ప్రజలంతా లాక్‌డౌన్ సమయంలో అమెజాన్, నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాలు చూస్తున్నారు. ఇకపై కొందరు తమ సినిమాలను వీటిల్లో విడుదల చేయొచ్చు. మరికొందరు థియేటర్ల ప్రారంభం కోసం ఎదురుచూడొచ్చు. ఇలాంటి రోజుల్ని కథల్లో ఊహించాం కానీ.. నిజంగా వస్తాయనుకోలేదు. కరోనా తరువాత మనమంతా కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాం. మార్పు మంచి కోసమైనప్పుడు అందరూ అంగీకరించాల్సిందే అని సురేష్ బాబు చెప్పుకొచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story