ర్యాపిడ్ టెస్ట్ కిట్లు వెనక్కు పంపేయండి: ఐసీఎమ్ఆర్

ర్యాపిడ్ టెస్ట్ కిట్లు వెనక్కు పంపేయండి: ఐసీఎమ్ఆర్

ర్యాపిడ్ టెస్ట్ కిట్లపై భారత వైద్య పరిశోధన మండలి కీలక సూచనలు చేసింది. ర్యాపిడ్ టెస్టుల కొనుగోళ్లు నిలిపివేయాలని.. ఇప్పటికే డెలివరీ తీసుకున్న వాటిని కూడా చైనా కంపెనీలకు వెనక్కు ఇచ్చేయాలని రాష్ట్రాలకు సూచించింది. టెస్టులు చేసిన తరువాత ఫలితాల్లో భారీ తేడాలు వస్తున్నాయని.. చైనా కంపెనీలు తొలుత ఇచ్చిన హామీకి విరుద్ధమైన ఫలితాలు వస్తున్నయని తెలిపింది. ఈ కిట్ల ద్వారా టెస్టులు చేసిన తరువాత.. వచ్చిన ఫలితాల్లో స్పష్టత రాకపోవడంపై రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీనిపై పరిశోధనలు చేసిన భారత వైద్య పరిశోధన మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

Tags

Read MoreRead Less
Next Story