కేంద్రం కీలక ప్రకటన.. వలస కార్మికులకు భారీ ఊరట

కేంద్రం కీలక ప్రకటన.. వలస కార్మికులకు భారీ ఊరట
X

వలస కార్మికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దేశంలోని పలు ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులు, యాత్రికులు, విద్యార్థులు సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు కేంద్ర హోం శాఖ అనుమతినిచ్చింది. ఆయా రాష్ట్రప్రభుత్వాలు తగు జాగ్రత్తలు తీసుకొని.. బస్సుల ద్వారా తరలించుకోవాలని సూచించింది.

బస్సులను శానిటైజ్ చేసి.. బస్సుల్లో తరలిస్తున్న వారిని భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం శాఖ తెలిపింది. అయితే.. ప్రతీ ఒక్కరికి స్క్రీనింగ్ పరీక్షలు చేయాలని.. కరోనా లక్షణాలు లేని వ్యక్తులనే మాత్రమే తరలించాలని కేంద్రం స్పష్టం చేసింది. స్వస్థలాలకు చేరుకున్న తరువాత ప్రభుత్వం వారిని హోం క్వారంటైన్ పాటించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కేంద్రం తాజా ప్రకటనతో.. పలు రాష్ట్రాల్లో ఇబ్బందులు పడుతున్న లక్షల మంది వలస కార్మికులకు, యాత్రికులకు, విద్యార్థులకు ఊరట లభించినట్టయింది.

Next Story

RELATED STORIES