జూన్ వరకు 'సినిమా' లేదు..

జూన్ వరకు సినిమా లేదు..

థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలంటే జూన్ వరకు ఆగాల్సిందే అంటోంది చైనా ప్రభుత్వం. కరోనా వ్యాప్తి నేపథ్యంలో జనవరిలోనే చైనాలో థియటర్లు మూసేశారు. మూవీ మార్కెట్లో చైనా ఇండస్ట్రీ రెండవ అతి పెద్దది. థియేటర్లు మళ్లీ ఎప్పుడు తెరవాలి అనే అంశంపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏప్రిల్ 30 తరువాత ఎమర్జెన్సీ లెవల్స్ కాస్తా తగ్గిస్తామని తెలిపారు. జూన్ మొదటి వారంలో మ్యూజియంలు, ఎంటర్‌టైన్మెంట్ వేదికలు, మూవీ థియేటర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని చైనా ఫిల్మ్ బ్యూరో డిప్యూటీ డైరెక్టర్ వాంగ్ జువాహూ తెలిపారు. చైనాలో 70 వేల సినిమా థియేటర్లు ఉన్నాయి. థియేటర్లు మూతపడడంతో చైనాకు సుమారు 400 కోట్ల డాలర్ల నష్టం వచ్చినట్లు వాంగ్ అంచనా వేశారు. ఇప్పటికే చాలా వరకు సినిమా కంపెనీలు దివాళా తీశాయి. ఇకపై ప్రభుత్వమే సినిమా హాళ్లను కంట్రోల్ చేస్తుందని ఆయన అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story