ప్లాస్మా థెరపి కొనసాగిస్తాం: కేజ్రీవాల్

ప్లాస్మా థెరపి కొనసాగిస్తాం: కేజ్రీవాల్
X

ప్లాస్మా థెరపి కొనసాగిస్తామని ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ప్లాస్మా థెరపి తొలి ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని, ఈ చికిత్స చేసిన తొలి పేషెంట్ పూర్తిగా కోలుకున్నారని ట్వీట్ చేశారు. అటు రాజస్థాన్‌లో చిక్కుకున్న ఢ్లిల్లీ విద్యార్థుల శుక్రవారం 40 బస్సులు పంపుతోందని చెప్పారు. వారిని వెనక్కి రప్పించి.. 14 రోజులు సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉంచుతామన్నారు. వలస కార్మికుల సమాచారంపై కూడా ఎప్పటికప్పుడు ఇతర రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు. ఇప్పటివరకు 1100 మంది కోరుకున్నారని.. వారి నుంచి ప్లాస్మా సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. చాలా మంది ప్లాస్మా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

Next Story

RELATED STORIES