కరోనా వైరస్ మరో రెండేళ్లు మనతోనే..

కరోనా వైరస్ మరో రెండేళ్లు మనతోనే..

నెలా, రెండు నెలలు లాక్‌డౌన్ విధించి కరోనా బారిన పడకుండా తప్పించుకుంటున్నాం అనుకుంటున్నాం కానీ 2022 లేదా ఆ తరువాత కూడా కోవిడ్ వ్యాప్తి కొనసాగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ మేరకు పరిశోధనలు సాగించిన మిన్నెసొటా యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ ఇన్ఫెక్షన్ డిసీజ్ రీసెర్చ్ అండ్ పాలసీ (సీఐడీఆర్‌ఏపీ) నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ జనాభాలో మూడింట రెండువంతుల మంది వైరస్‌ను తట్టుకునే శక్తి సంతరించుకునే వరకు ఈ ముప్పును నియంత్రించలేమన్నారు. వైరస్ సోకినా ఎలాంటి లక్షణాలు బయటపడకపోవడమే ఇందుకు కారణం అని అన్నారు. కొందరికి లోపల ఇన్ఫెక్షన్ ముదిరిపోతున్నా ఎలాంటి లక్షణాలు బయటకు కనిపించట్లేదన్నారు. అందువల్లే ఈ వైరస్‌ను ఇప్పట్లో కట్టడి చేయడం అసాధ్యమన్నారు. కరోనా విపత్తు ఇప్పటితో ముగియదని, ఇంతకంటే భారీ ఇన్ఫెక్షను మున్నుందు ఎదురవనున్నాయని, వాటిని ఎదుర్కునేందుకు సన్నద్ధం కావాలని సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story