మోదీ సహకారం మరిచిపోలేం: కువైట్ రాయబారి

మోదీ సహకారం మరిచిపోలేం: కువైట్ రాయబారి

దేశంలో వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్డౌన్ విధించి కరోనాని కట్టడి చేస్తున్న భారత ప్రధాని మోదీని ప్రపంచం ఆరోగ్య సంస్థతో సహా అన్ని దేశాలు ప్రశంసిస్తున్నాయి. దీంతో పాటు కరోనా బాధిత దేశాలకు మేమున్నామంటూ మోదీ అండగా నిలుస్తున్నారు. వారు కోరిన సహాయాన్ని అందిస్తున్నారు. తాజాగా కువైట్‌కు పారాసిటమల్ మాత్రలతో పాటు, 15 మంది సభ్యులతో కూడిన వైద్య బృందాన్ని, ఆహార పదార్ధాలను, అధునాతన వైద్య పరికరాలను సైతం ఆ దేశానికి అందిస్తున్న మోదీ ప్రభుత్వంపై ఢిల్లీలోని కువైట్ రాయబారి హెచ్‌ఈ జెస్సెం అల్ నజెం ప్రశంసల వర్షం కురిపించారు.

మీడియాతో మాట్లాడిన ఆయన కరోనాపై కువైట్ చేస్తున్న పోరుకు భారత్ అందిస్తున్న సాయం ప్రశంసనీయం అన్నారు. అంతే కాకుండా భారత్‌లో ఉన్న కువైట్ పౌరులను స్వదేశానికి తరలించడంలో సహకరించిన భారత అధికారులకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే కువైట్‌లో చట్ట విరుధ్ధంగా ఉంటున్న విదేశీయులతో పాటు భారతీయులను ఎలాంటి జరిమానా విధించకుండా అమ్నెస్టీ పథకం ద్వారా స్వదేశాలకు పంపిస్తున్నట్లు అల్ నజెం పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story