గుడ్‌న్యూస్.. మే 21కి కరోనా..

గుడ్‌న్యూస్.. మే 21కి కరోనా..

ఎన్నాళ్లో వేచిన ఉదయం మే 21కి వస్తుంది.. కరోనా.. కరోనా.. మేము బయటకు వస్తే నువ్వు లోపలకు వస్తావని అంటే కదా తలుపులు మూసుకుని, పనులు మానుకుని కూర్చున్నాం. మే 21కి వెళిపోతానంటే చాలా సంతోషం. 'ముంబయి స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పబ్లిక్ పాలసీ' అధ్యయనం ప్రకారం .. మే 21నాటికి కోవిడ్ కేసులు అదుపులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. అప్పటికల్లా కొత్త కేసుల పెరుగుదల పూర్తిగా ఆగిపోనుందని తెలిపింది. 'ఎండ్ ఈజ్ నియర్' పేరిట ప్రచురించిన ఈ అధ్యయనంలో భారత్‌లో లాక్‌డౌన్ కఠినంగా అమలు చేయడం వల్లే ఇది సాధ్యమైందని అభిప్రాయపడింది.

వివిధ దేశాల్లో వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న తీరును పరిశీలించి అంచనాకు వచ్చినట్లు పరిశోధకులు తెలిపారు. 'లాజిస్ట్రిక్ డిస్ట్రిబ్యూషన్' పద్దతి ద్వారా దీన్ని అంచనా వేసినట్లు అధ్యయన వేత్తలలో ఒకరు తెలిపారు. వీరి అంచనా ప్రకారం మే 21 నాటికి మహారాష్ట్రలో 24,222 కేసులు నమోదుకానున్నాయి. అయితే ఈ లెక్కలన్నీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా అంచనా వేశామన్నారు. రానున్న రోజుల్లో ఏవైనా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే పరిస్థితులు తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు.

Tags

Read MoreRead Less
Next Story