భారత్ లో 10లక్షలు దాటిన కరోనా పరీక్షలు

భారత్ లో 10లక్షలు దాటిన కరోనా పరీక్షలు
X

భారత్ లో కరోనా నిర్థారణకు చేస్తున్న ఆర్‌టి-పిసిఆర్ పరీక్షలు శనివారం సాయంత్రానికి 10 లక్షల మైలురాయిని దాటాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) తెలిపింది. శనివారం సాయంత్రం వరకు సుమారు 10,40000 పరీక్షలను పరీక్షలు జరిపామని.. కొద్ది రోజుల్లోనే కరోనా టెస్టుల సంఖ్య బాగా పెంచామని అన్నారు. గత రెండు రోజులు కూడా రోజుకి దాదాపు ఐసిఎంఆర్ 70,000 పరీక్షలు చేస్తోందని తెలిపారు. ఏపిల్ చివరి నాటికి 9,76,363 టెస్టులు చేయగా.. మే 1 నుంచి శనివారం సాయంత్రం వరకు 1,37,346 పరీక్షలు జరిపించామని తెలిపింది.

మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్ రాష్టాలు పరీక్షలు ఎక్కువగా జరుపుతున్న జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాయని.. ఇప్పటి వరకు ఈ మూడు రాష్ట్రాలు కూడా లక్షకు పైగా పరీక్షలు నిర్వహించాయని ఐసిఎంఆర్ తెలిపింది.

అటు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఢిల్లీ కూడా టెస్టులు ఎక్కువగా జరుపుతున్నప్పటికీ.. అవి ఇంకా పెంచాల్సిన అవసరం ఉందని తెలిపింది.

Next Story

RELATED STORIES