ఉగ్రవాదులకు కలిసొచ్చిన కరోనా.. జైలు నుంచి హఫీజ్ సయీద్..

ఉగ్రవాదులకు కలిసొచ్చిన కరోనా.. జైలు నుంచి హఫీజ్ సయీద్..

ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా పాకిస్థాన్ జైళ్లలో మగ్గుతున్న ఉగ్రవాదులకు వరంలా కనిపించింది. పంజాబ్ జైల్లో 50 మంది ఖైదీలకు కరోనా నిర్ధారణ అంటూ వార్తలు రావడంతో ఖైదీలపై దృష్టి సారించాయి ప్రభుత్వాలు. కొంత మంది ఖైదీలను ఇప్పటికే విడుదల చేయగా.. తాజాగా పాకిస్థాన్ జైల్లో ఉన్న లష్కరే తాయిబా చీఫ్, అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌ను సైతం విడుదల చేసి సంచలనం సృష్టించింది. భారత్ అంతర్జాతీయంగా తెచ్చిన ఒత్తిడి కారణంగానే పాక్ ప్రభుత్వం హఫీజ్‌ని గృహ నిర్భంధంలో ఉంచింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో పాక్ కోర్టు అతడికి 11 ఏళ్ల జైలు శిక్షను విధించింది. ముంబయి పేలుళ్ల కేసు, భారత్‌లో విధ్వంసాలకు కుట్రలు తదితర కేసులకు సంబంధించి హఫీజ్‌ని అప్పగించమని భారత్ కోరుతున్న నేపథ్యంలో కరోనాని కారణంగా చూపుతూ అతడిని విడుదల చేయడం కొంత ఆందోళన కలిగించే అంశం. కాగా విడుదలైన ఉగ్రవాదుల్లో ముంబై పేలుళ్ల మాస్టర్ మైండ్ జకీ-ఉర్-రెహ్మాన్ లఖ్వీ కూడా ఉన్నాడు.

Tags

Read MoreRead Less
Next Story