చైనా కావాలనే చెప్పలేదు

చైనా కావాలనే చెప్పలేదు

చైనా వైరస్‌ని వ్యాప్తి చేయడమే కాకుండా అంతే త్వరగా నియంత్రణ చర్యలు కూడా చేపట్టింది. ఇంత పగడ్భందీగా వ్యవహారాన్ని చక్కబెట్టిందంటే వైరస్ తీవ్రతను కావాలనే ప్రపంచానికి తెలయజేయలేదనేది స్పష్టమవుతుంది అని అమెరికా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే అమెరికా చైనాపై చేస్తున్న ఆరోపణలేవీ అవాస్తవం కాదంటోంది ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్. ఈ మేరకు అమెరికా హోంలాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ నివేదికలో పొందు పరిచిన విషయాలను ప్రస్తావించింది.

వైరస్‌ని ఎదుర్కోవడానికి డ్రాగన్ దేశం ముందుగానే కావలసిన ఔషధాల్ని నిల్వ చేసుకుంది. అందుకే దాని తీవ్రతను ముందుగా బయటపెట్టలేదు. మరోవైపు దిగుమతుల్ని పెంచుకుని, ఎగుమతులను తగ్గించిందని నివేదికలో ఉన్నవిషయాన్ని పేర్కొంది. ఆఖరికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌వో)కు సైతం వ్యాధి తీవ్రతను తెలియజేయలేదని స్పష్టం చేసింది. ఇది అంటువ్యాధి అని ప్రపంచాన్ని కబళిస్తుందన్న విషయాన్ని పేర్కొనలేదంది. ఈ క్రమంలోనే మాస్కులు, సర్జికల్ గౌన్లను భారీ స్థాయిలో దిగుమతి చేసుకుందని తెలిపింది. వైరస్ అనంతర పరిణామాలను పునరాలోచించితే ఈ విషయాలు స్పష్టమవుతాయని పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story