ఒకే స్టేష‌న్‌లోని 12 మంది పోలీసుల‌కు క‌రోనా పాజిటివ్

ఒకే స్టేష‌న్‌లోని 12 మంది పోలీసుల‌కు క‌రోనా పాజిటివ్
X

మ‌హాన‌గ‌రం ముంబైలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ముంబైలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా ని జెజె మార్గ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఆరుగురు సబ్ ఇన్‌స్పెక్టర్లతో సహా 12 మంది పోలీసులకు కరోనా వైరస్ సోకినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ముందుజాగ్రత్తగా క‌రోనా సోకిన వారితో సంప్రదింపులు జరిపిన 40 మందిని సెల్ఫ్‌క్వారంటైన్‌లో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు.

ఇదిలావుండ‌గా పైధుని పోలీస్ స్టేషన్‌కు చెందిన‌ ఆరుగురు పోలీసులు, నాగ్పాడాలో ముగ్గురు, మహీమ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన‌ ఇద్దరు పోలీసులకు కూడా క‌రోనా సోకింది. కరోనా మహమ్మారి కారణంగా మహారాష్ట్రలో నలుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు మహారాష్ట్రలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 14541 కు చేరింది. ముంబైలో మాత్రమే 9 వేలకు పైగా కేసులు ఉన్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటివరకు మ‌హారాష్ట్ర‌లో 583 మంది ప్రాణాలు కోల్పోయారు.

Next Story

RELATED STORIES