28 మంది కూరగాయల వ్యాపారులకు కరోనా పాజిటివ్

28 మంది కూరగాయల వ్యాపారులకు కరోనా పాజిటివ్
X

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇక ఉత్తరప్రదేశ్ లో ఈ మహమ్మారి స్వైర విహారం చేస్తోంది. రాష్ట్రంలో రోజు రోజుకీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వం కరోనా కట్టడికి చర్యలు చేపడుతోంది. అయినా కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా కూరగాయలు విక్రయిస్తున్న 28 మంది వ్యాపారులకు కరోనా వైరస్ సోకింది. ఆగ్రా నగరంలో వెలుగుచూసిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కల్గిస్తుంది.

ఒక్క ఆగ్రా నగరంలోనే గత పదిరోజుల్లో 28 మంది కూరగాయల వ్యాపారులకు కొవిడ్-19 పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది. 160 మంది వీధి వ్యాపారులు, కూరగాయల వ్యాపారులు, కిరాణా దుకాణాల వ్యాపారులకు కరోనా పరీక్షలు చేయగా వారిలో 28 మంది కూరగాయల వ్యాపారులకు కరోనా పాజిటివ్ తేలింది. కరోనా వైరస్ సోకిన కూరగాయల వ్యాపారులు ఎక్కువ మంది బాసాయి, తాజ్ గంజ్ మండీల్లో కూరగాయలు విక్రయించేవారని అధికారులు తెలిపారు. కరోనా వచ్చిన కూరగాయల వ్యాపారులను క్వారంటైన్ కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.

కరోనా వ్యాప్తి చెందకుండా నివారించేందుకు ఆగ్రా నగరంలోని 20 వార్డుల్లో ఇంటివద్దకే కూరగాయల పంపిణీని ప్రారంభించామని అధికారులు పేర్కోన్నారు. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో పండ్ల మార్కెట్ లోనూ ప్రజలు సామాజిక దూరం పాటించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Next Story

RELATED STORIES