కరోనా మందు కనిపెట్టాం: ఇటలీ

కరోనా మందు కనిపెట్టాం: ఇటలీ

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. అన్ని దేశాలు ఈ మహమ్మారిని అడ్డుకునేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటూనే.. మరోవైపు దీనికి మందు కనిపెట్టే పనిలో తలమునకలై ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటలీ ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. మానవులపై పనిచేసే కరోనా వైరస్ వ్యాక్సీన్‌ను అభివృద్ధి చేసినట్టు ప్రకటించింది. రోమ్‌లోని స్పల్లంజానీ ఆస్పత్రిలో నిర్వహించిన పరీక్షల్లో.. ఈ వ్యాక్సీన్ ఎలుకల్లో యాంటీబాడీలను ఉత్పత్తిచేస్తున్నట్టు గుర్తించారు. ఇది మానవ కణాలపైనా సమర్థంగా పనిచేస్తుందని ఇటలీ పరిశోధకులు చెబుతున్నారు. కరోనా వైరస్‌ వ్యాక్సీన్‌కు తయారీలో ఇదొక పెద్ద శుభవార్త అని దీన్ని తయారు చేస్తున్న టకిస్ సంస్థ సీఈవో లుయిగి ఆరిసిచియో పేర్కొన్నారు. ఈ వేసవి తర్వాత మానవులపై పరీక్షలు మొదలయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story