ఆరోగ్య సేతు యాప్ ఇన్‌స్టాల్ చేయకపోతే.. జైలుకే

ఆరోగ్య సేతు యాప్ ఇన్‌స్టాల్ చేయకపోతే.. జైలుకే

ఆరోగ్య సేతు అప్లికేషన్‌ను ప్రతి ఒక్కరు ఇన్‌స్టాల్ చేసుకోవాలని.. దీనిని తప్పని సరి చేస్తూ.. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా పాలకమండలి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎవరైనా ఈ అప్లికేషన్‌ను వినియోగించకుంటే వారిపై నమోదు చేసి.. రూ.1000 జరిమానా లేదా 6 నెలలు జైలు శిక్ష వేస్తామని అక్కడి అధికారులు హెచ్చరించారు.

కరోనా వ్యాధి వ్యాప్తిని తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఈ అప్లికేషన్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా కరోనా ప్రభావం ఎక్కడ ఎక్కువగా ఉంది? ఎలా వ్యాప్తి చెందుతుందో కేంద్రం తెలుసుకోగలుగుతుంది. అటు, దీనిని వినియోగిస్తున్న వారు కూడా తాము ఎవరైనా కరోనా బాధితులను కలిసామా? కరోనా ఎక్కువగా ఉన్న ప్రాంతంలో పర్యటించామా.. అనే విషయాలు తెలుసుకోవచ్చు. దీంతో కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ.. కరోనా వ్యాప్తి జరగకుండా అడ్డుకోవచ్చు. ఇప్పటివరకు దేశంలోనే 5 కోట్ల మందికి పైగా ప్రజలు ఈ అప్లికేషన్‌ను దేశంలో వినియోగిస్తున్నారు. అయితే మిగిలిన వారు కూడా ఈ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ అప్లికేషన్ వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా పాలకమండలి నిర్ణయం తీసుకుంది.

Tags

Read MoreRead Less
Next Story