ఆ డబ్బు ఎవరి కోసం?: ప్రియాంక గాంధీ

ఆ డబ్బు ఎవరి కోసం?: ప్రియాంక గాంధీ
X

పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి వచ్చిన డబ్బు ఎవరికోసం కూడబెడుతున్నారని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. ఈ సంక్షోభ పరిస్థితుల్లో ధరలు తగ్గించడానికి బదులు పెంచేస్తారా అంటూ నిలదీసింది.

కరోనాపై పోరాటంతో కోట్లాది మంది ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ సమయంలో ధరలు తగ్గించడానికి బదులు పెట్రోల్‌పై రూ.10, డీజిల్ రూ.13 చొప్పున ఎక్సైజ్ డ్యూటీ పెంచడం ఎంతమాత్రం సబబు కాదని ఆమె మంది పడ్డారు. క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గినందున ప్రజలు ఆ ప్రయోజనాలు పొందాలని, అయితే ఇందుకు భిన్నంగా పదేపదే ఎక్సైజ్ డ్యూటీని బీజేపీ ప్రభుత్వం పెంచుకుంటూ పోతోందని ట్వీటర్ వేదికగా ఆమె విమర్శించారు. ఎవరి కోసం ఈ సొమ్ములు కూడబెడుతున్నారంటూ ఆమె తన ట్వీట్‌లో ప్రశ్నించారు.

ప్రజలు లబ్ది పొందడం లేదు. వసూలు చేసిన సొమ్ము కార్మికులు, రైతులు, మధ్యతరగతి ప్రజలకు, పరిశ్రమలకు ఉపయోగించడం లేదు. మరి ఎవరి కోసం సొమ్ములు దాచిపెడుతున్నారో అర్ధం కావడం లేదని ప్రియాంక గాంధీ నిలదీశారు.

Next Story

RELATED STORIES