జాతీయం

ఏప్రిల్ చివరి వారంలో 27.1 శాతానికి చేరిన నిరుద్యోగిత రేటు

ఏప్రిల్ చివరి వారంలో 27.1 శాతానికి చేరిన నిరుద్యోగిత రేటు
X

కరోనా మహమ్మారి ప్రభావం అన్ని రంగాలపై పడింది. దీంతో ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. కరోనా కట్టడికి లాక్ డౌన్ విధించడంతో ఏప్రిల్ నెలలో దేశవ్యాప్తంగా 12.2 కోట్ల మంది నిరుద్యోగులుగా మారారని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అంచానా వేసింది. లాక్ డౌన్ కారణంగా అన్ని వ్యాపార సంస్థలు మూట పడటంతో చాలా మంది వారి ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో ఏప్రిల్ చివరి వారంలో నిరుద్యోగిత 27.1 శాతానికి చేరిందని తెలిపింది. దినసరి కూలీలపై ఈ ప్రభావం ఎక్కువగా పడిందని తెలిపింది. కరోనా వలన అమెరికాలో ఏర్పడిన నిరుద్యోగుల కంటే.. భారత్ లో నాలుగు రేట్లు ఎక్కువగా ఉన్నారని ఈ సంస్థ తెలిపింది. లాక్ డౌన్ మరింత కాలం పొడిగించిన నేపథ్యంలో బలహీన వర్గాలు మరింత వేదనకు లోనయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

Next Story

RELATED STORIES