31 మంది పోలీసుల‌కు కరోనా పాజిటివ్‌

దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఇక మ‌ధప్ర‌దేశ్ లో క‌రోనా కలకలం సృష్టిస్తోంది. ఈ ప్రాణాంతకర వైరస్ కారణంగా రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. తాజాగా రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు 31 మంది పోలీసుల‌కు క‌రోనా పాజిటివ్ గా నిర్దార‌ణ అయింద‌ని ఇండోర్ ఎస్పీ మ‌హ్మ‌ద్ యూసుఫ్ ఖురేషి తెలిపారు. వారిలో 22 మంది ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. 8 మంది కోలుకుని డిశ్చార్జ‌య్యారని, ఒక పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోయార‌ని తెలిపారు. లాక్ డౌన్ విధుల్లో ఉన్న పోలీసుల్లో క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించిన వారిని వెంట‌నే హాస్పిటల్‌కు త‌ర‌లిస్తున్నట్లు వివరించారు.

Next Story

RELATED STORIES