ప్రజా రవాణా త్వరలోనే ప్రారంభిస్తాం: నితిన్ గడ్కరీ

X
లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజారవాణాపై కేంద్ర రవాణాశాఖా మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. ప్రజా రవాణా కొద్ది రోజుల్లోనే ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని ఆయన వెల్లడించారు. దేశంలోని బస్సు, కార్ల ఆపరేటర్లతో ఆయన బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ప్రజా రవాణాను పున: ప్రారంభించడం ద్వారా ప్రజల్లో తిరిగి ఉత్సాహం వస్తుందని.. కొన్ని నిబంధనలతో ప్రజా రవాణాకు అనుమతినిస్తామని ఆయన ప్రకటించారు. అయితే బస్సులను, కార్లను నడిపే సమయంలో మాత్రం మాస్కులు ధరించడం, శానిటైజర్స్ వాడటం, సామాజిక దూరం పాటించడం లాంటి నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందేనని గడ్కరీ స్పష్టం చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
