అంతర్జాతీయం

పాకిస్థాన్‌లో ఒక్కరోజే 1764 కరోనా పాజిటివ్ కేసులు

పాకిస్థాన్‌లో ఒక్కరోజే 1764 కరోనా పాజిటివ్ కేసులు
X

దాయాది దేశం పాకిస్థాన్‌లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. పాక్‌లో కరోనా వైరస్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1764 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఈ వైరస్‌ బారిన పడినవారి సంఖ్య 25,837కు చేరింది. అదేవిధంగా ఒక్క రోజు వ్యవధిలో కరోనా మహమ్మారి వల్ల 35 మంది బాధితులు మృతిచెందారని పాక్‌ ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో దేశంలో మొత్తం మృతుల సంఖ్య 594కు చేరింది.

Next Story

RELATED STORIES