విశాఖ ఘటనపై అధికారులతో సీఎం జగన్ సమీక్షా సమావేశం

విశాఖ ఘటనపై అధికారులతో సీఎం జగన్ సమీక్షా సమావేశం
X

ఎల్జీ పాలిమర్స్ ఘటన తర్వాత చేపట్టిన చర్యలపై అధికారులతో సమీక్షించారు సీఎం జగన్. విష వాయువు ప్రభావం తగ్గించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టారో అధికారులను అడిగి తెలుసుకున్నారు. విశాఖపట్నం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం జగన్ కు సీఎస్ తో పాటు.. జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, సీపీ ఆర్కేమీనా ఘటనా ప్రదేశంలోని పరిస్థితులను వివరించారు. ప్రస్తుతం అంతా అదుపులోనే ఉందని సీఎస్ తెలిపారు. విష వాయువుల ప్రభావాన్ని నియంత్రించేందుకు చేపట్టిన చర్యలను సీఎంకు వివరించారు జిల్లా కలెక్టర్ వినయ్ చంద్.

Tags

Next Story